కొడాలి నాని సవాల్.. చంద్రబాబు స్వీకరిస్తారా?
ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు బాబు సిద్ధమయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కుక్క బతుక్కి వచ్చే ఎన్నికల్లో చెప్పుదెబ్బ తప్పదని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్న మాజీ మంత్రి కొడాలి నాని... దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నారు.