
జగన్‌తో కొలిక్కిరాని బాలినేని పంచాయతీ?
అంతేకాదు.. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా మా మధ్య చర్చ జరగలేదని.. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని బాలినేని తెలిపారు. మంత్రి పదవినే వదులుకుని వచ్చి ప్రోటోకాల్ గురించి ఫీల్ అయ్యేది ఏముంటుందన్న బాలినేని.. కావాలనే పార్టీలోని కొందరు మీడియాకు లీక్ ఇచ్చి దుష్ప్రచారం చేశారని అన్నారు. నేనెప్పుడూ పార్టీపై అలగలేదని.. పార్టీలోని కొందరు ఇబ్బందులు పెట్టారని బాలినేని అన్నారు.