ఏపీ సీఎం జగన్‌ను బద్‌నాం చేసేందుకు ఎల్లో
మీడియా రెడీగా ఉంటుంది. అందుకే సీఎం
జగన్ పాలనలో గుడులు, గోపురాల్లో అరాచకాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తుంది. అందుకే సీఎం
జగన్ క్రిస్టియన్ కావడం కారణం. అయితే..
జగన్ కూడా తన ఎత్తులతో ఆ ప్రచారానికి
చెక్ పెడుతున్నారు. వీలైనప్పుడల్లా పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గల గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.
అంతే కాదు.. ఇటీవల విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో
ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక అంటే 108 చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత
శ్రీ లక్ష్మీ
మహా యజ్ఞంలోనూ వైయస్ జగన్ పాల్గొని పూజలు చేశారు. ఆ
మహా యజ్ఞం విజయవంతంగా పూర్తి అయింది. అంతే కాదు. వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గోశాలలో సీఎం
జగన్ శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ శాంతి యజ్ఞంలో వైయస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు.