జగన్.. పదివేల కోట్లు తెచ్చినా.. పతాక శీర్షిక లేదా?
ఇది సాధారణ విజయం కాదు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతంలో నిర్మాణాలకోసం అదనంగా రూ.2వేల కోట్లు కూడా ఇందులో భాగంగా ఇచ్చారు. కాంపౌండ్ వాల్ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు ఇచ్చింది. ఇంత సాధించినా ఇదేమీ ఎల్లో మీడియాలో వార్తలు రాలేదు. ఎక్కడో ఓ మూల చిన్నగా రాశారు తప్ప పతాక శీర్షిక కాలేదు.