లోకేశ్ భద్రత: వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదా?
సెల్ఫీ ఫోటో ఇవ్వకపోతే రాళ్లు, కోడిగుడ్లుతో నాయకుల్ని కొట్టే కార్యకర్తలు టీడీపీ పార్టీలో ఉన్నారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మీపార్టీ వాళ్లు మిమ్మల్ని కోడిగుడ్లు విసిరి దాడి చేస్తే.. మేం ప్రభుత్వం తరఫున భద్రత పెంచడమేంటని మాజీ మంత్రి పేర్ని నాని అడిగారు. ముందుగా బాబు టీడీపీ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పుకోవాలని.. కార్యకర్తలకు క్రమశిక్షణ ఇచ్చుకోలేని దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని అందరూ అనుకోవాలి కదా అని పేర్ని నాని అన్నారు.