చంద్రబాబు అప్పుడే ఆ పని చేసి ఉండాల్సింది?
అధికారంలో ఉన్నప్పుడు బాబుకు ప్రజలు గానీ, వారికి ఇచ్చిన హామీలు గానీ ఏమీ గుర్తుకురావనే విమర్శలు వస్తున్నాయి. అధికారం పోగానే కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నింటినీ చెప్పగల నేర్పరితనం ఉన్న నాయకుడు చంద్రబాబు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తే ఇప్పుడు జగన్కు ఆ అవకాశం వచ్చేదే కాదు. అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గ కమిటీల పేరుతో కాలయాపన చేశారు.