కేసీఆర్, కిషన్ రెడ్డి కుమ్మక్కు.. ఇవిగో సాక్ష్యాలు?
కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవని వాటిని డిజిటలైజ్ చేసేందుకు అప్పట్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూములపై విచారణ జరిపిస్తామన్నారు. అప్పుడు కలెక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.