జగన్.. సజ్జల 175 కోరిక తీరేనా?
ఎన్నికల ముందే వైఎస్ జగన్ ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ చేసి హామీలు ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. - బీసీల కోసం ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నారని.. కొన్ని హామీల అమలు లో రాజకీయంగా రిస్క్ అని తెలిసినా సీఎం జగన్ ముందడుగు వేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావాలని సీఎం అడుగులు వేశారని.. రాష్ట్రంలో 70 శాతం పైగా పథకాలు అక్కా చెల్లెళ్ల పేరిటే అమలవుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు వైకాపా నే గెలుస్తుందని.. బీసీలంతా ప్రభుత్వ పథకాలు వినియోగించుకునేలా అందరినీ చైతన్యవంతులుగా చేయాలని సజ్జల పిలుపు ఇచ్చారు.