వైసీపీ ఎంపీ.. ఛలో ఢిల్లీ పోరాటం ఫలించేనా?
బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. జగన్ చేస్తోన్న సామాజిక న్యాయాన్ని బీసీలు అర్థం చేసుకోవాలని బీసీల నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీల పక్షపాతి అంటున్న బీసీల నేత ఆర్ కృష్ణయ్య.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నేను కోరుతుంటే స్థానిక సంస్థల్లో సీఎం జగన్ 60శాతం పైగా రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగన్ ను బీసీలంతా కాపాడుకోవాలని మద్దతివ్వాలని బీసీల నేత ఆర్ కృష్ణయ్య అన్నారు.