ఎక్కడ పోటీ చేయాలో పవన్‌కు క్లారిటీ రాలేదా?
అలా ఓడిపోయిన తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్.. తనను కక్ష కట్టి ఓడించారని జగన్‌ను నిందిస్తారంటూ వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు. గతంలో పవన్ కల్యాణ్ బాబా అవతారం ఎత్తిన పవన్ అమరావతి గురించి ప్రకటన చేశాడని... అందుకే ఒక్కసారి పవన్ ను సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ ఒక గంట ఒక మాదిరిగా, మరో గంట మరో మాదిరిగా ఉంటాడని.. వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.