అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్?
అలాగే ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడి పథకానికి అర్హులు కారు. దీంతో పాటు వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాలు దాటి ఉంటే అమ్మఒడి రాదు. మాగాణి భూమి 3 ఎకరాల్లోపే ఉండాలి. రెండూ కలిపి ఉంటే 10 ఎకరాలు దాటకూడదు. అలాగే విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించకూడదు. పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకూడదు.