ఆ ఛానళ్లపై కేసులేస్తానంటున్న అషు రెడ్డి?
తనను
కించపరిచేలా వ్యవహరించిన ఛానెల్‌పై పరువు నష్టం దావా వేస్తానని నటి అషు రెడ్డి మండిపడుతోంది. నిర్మాత కేపీ చౌదరితో గంటల కొద్దీ ఫోన్ మాట్లాడినట్లు చెబుతున్నారన్న నటి అషు రెడ్డి .. అదంతా అబద్దమంటోంది. కేపీ చౌదరితో పరిచయం, ఫోన్ కాల్స్‌పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని నటి అషు రెడ్డి తెలిపింది. నాపై ఆరోపణల పట్ల మౌనంగా ఉండలేక ఈ వీడియో పోస్టు చేస్తున్నానంటూ నటి అషు రెడ్డి వివరణ ఇచ్చింది.