అసలు మీ కిడ్నీ ఎలా ఉందో మీకు తెలుసా. మీ కిడ్నీ ఏ పరిస్థితుల్లో ఉందో అని ఎప్పుడైనా గమనించారా.. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కిడ్నీ పరీక్ష చేయించుకుంటే దాని పరిస్థితి తెలుస్తుంది. అయితే ఈ కిడ్నీ పరీక్షలు వేల రూపాయలు వెచ్చించాల్సిన పని లేదు. దేశంలో ఎక్కడి వారయినా కేవలం రూ.100 వెచ్చిస్తే చాలు.. ఏదైనా డయాగ్నసిస్ సెంటర్‌కు వెళ్లి బ్లడ్‌లో క్రియాటిన్ పరీక్ష చేసి ఇమ్మంటే చాలు.. రక్తం శాంపిల్ తీసుకుని ఈ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష దేశంలోని చిన్న పల్లెటూరి కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
మరి ఈ క్రియాటిన్ పరీక్ష ఫలితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. సాధారణ మనిషికి క్రియాటిన్ 0.5 నుంచి1 పాయింట్లు ఉండాలి. క్రియాటిన్ ఫలితం 1.5 ఉందంటే.. కిడ్నీ వైఫల్యానికి సమస్య ప్రారంభంలో ఉందని అర్థం. క్రియాటిన్ 2 పాయింట్లు ఉందంటే.. మీ కిడ్నీలు సగం పాడయ్యాయని అర్థం. క్రియాటిన్ ఫలితం 4 పాయింట్లు ఉందంటే మీ కిడ్నీలు చాలా పాడైనట్టు అర్థం. ఇక 8 పాయింట్లు ఉంటే.. మీ కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని తెలుసుకోవాలి.