వర్షాకాలం అరాచకాలకు.. హైదరాబాద్ సిద్ధమేనా?

frame వర్షాకాలం అరాచకాలకు.. హైదరాబాద్ సిద్ధమేనా?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో జీవనం ఆనంద దాయకం. కానీ.. వర్షాకాలంలో మాత్రం నగర జీవనం కొన్ని సార్లు నరక ప్రాయం అవుతోంది. మళ్లీ వర్షా కాలం వచ్చింది. మరి ఈ సారి నగర పాలక సంస్థ ఎంత చక్కగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుందో చూడాలి. వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
అసలే ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడికక్కడ అధికారులు పారిశుధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. నగర పారిశుద్ధ్యన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశానిర్ధేశం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More