నిన్ను తిట్టినవాళ్లనే.. గెలిపిస్తావా పవన్‌?

frame నిన్ను తిట్టినవాళ్లనే.. గెలిపిస్తావా పవన్‌?

Chakravarthi Kalyan
తన తల్లిని తిట్టినవాళ్లను గెలిపించమని పవన్‌ ప్రాధేయపడుతున్నారని వైసీపీ మంత్రి రోజా విమర్శిస్తున్నారు. మీ అమ్మా.. భార్యను తిట్టింది టీడీపీ వాళ్లు కాదా అని మంత్రి రోజా నిలదీశారు. తల్లిని చంద్రబాబు, లోకేష్ తిట్టారని 2018 లో నువ్వు సోషల్‌ మీడియాలో పోస్టు చెయ్యలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తల్లిని తిట్టించారని ఆ సందర్భంలో చెప్పిన పవన్‌.. ఇప్పుడు అదే ఏబీఎన్‌ రాధాకృష్ణకు సిగ్గులేకుండా ఎలా ఇంటర్వ్యూ ఇచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు.

నీ కార్యకర్తలను  సంకరజాతి వాళ్ళు అని  బాలకృష్ణ తిడితే.. మళ్లీ వెళ్లి ఆయనకే ఇంటర్వ్యూ ఇస్తావా అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు.  మహిళల అక్రమ రవాణా జరిగింది చంద్రబాబు హయాంలోనేన్న మంత్రి రోజా.. ఆ టైంలో జరిగిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై అసలు ఎందుకు పెదవి విప్పలేదని పవన్‌ను నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందన్న మంత్రి రోజా అందుకే జగనన్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More