కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ సీఎంగా ఆ మహిళ?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే ఓ మహిళ సీఎం అవుతారా.. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల అమెరికా వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. అక్కడ తానా సభల్లో మాట్లాడుతూ మా పార్టీలో గిరిజనులు, దళితులు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని.. హైకమాండ్ ఆదేశిస్తే సీతక్క కూడా సీఎం అవుతుందని అనడం కలకలం సృష్టిస్తోంది.

దీనిపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్... ముఖ్యమంత్రి కాదు.. మెదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని అరవింద్ ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందేనన్నఅరవింద్.. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయన్న భయం కేసీఆర్ లో మెదలైందన్నారు. 24గంటల విద్యుత్ పై రేవంత్ కామెంట్స్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాడని అరవింద్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: