నోరుజారిన రేవంత్‌.. డిఫెన్సులో పడిన కాంగ్రెస్‌?

Chakravarthi Kalyan
ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి. రైతులకు 8 గంటల విద్యుత్ చాలని ఆయన మాట్లాడటంతో దాన్ని బీఆర్‌ఎస్‌ బాగా వాడుకుంటోంది. దీంతో కాంగ్రెస్ మళ్లీ వివరణ ఇచ్చుకుంటోంది. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పథకమేన్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ దేనన్నారు. అమెరికా ఎన్ అర్ ఐ  ల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన మాటలను టిఆర్ఎస్ వక్రీకరించిందని మల్లు రవి అన్నారు.

రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడారని.. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ప్రారంభించిన విషయం టిఆర్ఎస్ నాయకులకు గుర్తుండాలని మల్లు రవి  అన్నారు. వైస్సార్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు వ్యతిరేకించారని.. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని.. రేవంత్ రెడ్డి అక్కడ విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని.. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకటించాలంటే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో నిర్ణయం తీసుకుంటుందని మల్లు రవి అన్నారు. మేము రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామన్న మల్లు రవి... రైతులను తప్పు దోవ పట్టించడానికే కేటీఆర్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: