జగన్‌.. హిందూ జోలికొస్తే ఊరుకోను.. పవన్‌ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
జగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని తణుకు సభలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదని.. అన్నవరంలో పురోహితులను వేలం పెట్టారని.. పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అన్ని ప్రశ్నించిన పవన్‌.. వేలం వేయడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉందా అన్నారు.

 
హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా అని నిలదీసిన పవన్‌.. అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. వస్తువులు, ప్రసాదాలు, కేశాలపైన వేలం వేయవచ్చుని.. అర్చకులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఈ విషయాన్ని జనసేన తరఫున కోర్టులో ఛాలెంజ్‌ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆలయాలను దుర్వినియోగం చేస్తున్నారని.. హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారని.. హిందూ ధర్మాన్ని ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా.. హిందూ ధర్మం విషయంలో పిచ్చి వేషాలు వేయవద్దని పవన్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: