యూసీసీ: చక్రం తిప్పుతున్న అజిత్‌దోవల్‌

Chakravarthi Kalyan
యూనిఫామ్ సివిల్ కోడ్ పై ముస్లిం సంఘాలు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తదితరులతో దౌత్యవేత్త అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అజిత్ దోవల్ యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.

అదే సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అనేది ఒక మతానికి, కులానికి చెందినది కాదని దేశ అవసరాల రీత్యా తీసుకొస్తున్న ప్రధానమైన చట్టం అని తెలిపారు. అదే సమయంలో ముస్లింలకు ఉన్న ఇబ్బందులు ఏమిటో విన్నారు. అనంతరం ఛాయిస్ మీ చేతుల్లోనే ఉందని ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. ముస్లింలు షరియ చట్టం అమలు చేసుకోవచ్చు. లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ కు అంగీకరించండి అని కుండ బద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: