ఏపీ అప్పులు.. బాబు కంటే జగనే బెటరా?

frame ఏపీ అప్పులు.. బాబు కంటే జగనే బెటరా?

Chakravarthi Kalyan
ఆలీబాబా చంద్రబాబు అయితే, పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ తో సహా నలభై దొంగలు వాళ్ల పార్టీ వారేనని వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. చంద్రబాబు 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, జగన్ 1 లక్షా 30 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. పవన్ వృధా మనిషి అని ఢిల్లీలో రాష్ట్ర సమస్య గురించి అడిగితే తనకు అవగాహన లేదు.. నాదెండ్ల మనోహరే మాట్లాడతారని చెప్పారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

పవన్ కు రాష్ట్రంపై అవగాహన లేదని.. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని.. ప్రస్తుతం దుకాణాల్లో ఏం కొనుగోలు చేసిన పోన్ నంబర్ అడుగుతున్నారు...ఫోన్ నంబర్ చెపితే మన డేటా వెళ్లిపోయినట్లేనా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లుతుంటే పవన్ కళ్యాణ్‌ మాత్రం రాష్ట్రం వెనక్కి వెళ్ళాలని కోరుకుంటున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More