బ్రో సినిమాపై అంబటి.. పవన్‌కు దిమ్మతిరిగే పంచ్‌?

Chakravarthi Kalyan
ఇటీవల వచ్చిన బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును గుర్తు చేసేలా పృధ్వీరాజ్‌తో ఓ క్యారెక్టర్‌ వేయించారు. అందులో ఆ క్యారెక్టర్‌ డ్యాన్స్ చేస్తుంటే.. పవన్ కల్యాణ్‌ ఆయన్ను చీవాట్లు పెడతారు. ఇది కావాలనే అంబటిపై పవన్‌ సెటైరికల్‌గా చేయించారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తనది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందమని అంబటి రాంబాబు అన్నారు.

బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్‌ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానే అంబటి రాంబాబు స్పందించి.. పవన్‌పై విమర్శలు గుప్పించేశారు. పవన్‌ సినిమాలో తన క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నానని అంబటి రాంబాబు అన్నారు. అయితే.. పవన్‌ది శునకానందమని.. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. సంక్రాంతికి తాను వేసింది ఆనంద తాండవమని.. ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిని అయిన ఆనందమని.. తాతను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయనని అంబటి రాంబాబు అన్నారు. నా డ్యాన్స్‌ సింక్‌ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్‌ మాస్టర్‌నా అంటూ ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాలకు పవన్‌ సింక్‌ అవ్వడని అంబటి రాంబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRO

సంబంధిత వార్తలు: