పురందేశ్వరిపై రోజా షాకింగ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అంటూ మంత్రి ఆర్కే రోజా సందేహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్న మంత్రి ఆర్కే రోజా.. పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ ధ్యేయమన్న మంత్రి ఆర్కే రోజా... పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా అన్న సందేహం వస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలే  పురంధేశ్వరి కూడా మాట్లాడుతున్నారని... ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం తీసుకోవాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఏపీ అప్పుల్లో ఉందని పురంధేశ్వరి అనడం హాస్యాస్పదమన్న మంత్రి ఆర్కే రోజా... అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: