బిగ్ బ్రేకింగ్: టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం!?
దీనికి సంబంధించిన విధివిధానాల కోసం సబ్ కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పుడు వారి కలను కేసీఆర్ ప్రభుత్వం నిజం చేయబోతోంది. అయితే ఇప్పటికే ఆంధ్రాలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు. అంటే ఇప్పుడు జగన్ బాటలో కేసీఆర్ నడుస్తున్నారన్నమాట.