విశాఖకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ?
కేంద్రం దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. అందులో భాగంగా గ్రౌండింగ్ అయిన ప్రాజెక్టులకుగాను రూ.73.31 కోట్లతో చేపట్టిన 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మిగిలిన ప్రాజక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 217 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన మరికొన్ని పనులు పూర్తయ్యాయి. విశాఖలో తాగునీటి సరఫరాకు సంబంధించి 70.44 కోట్లతో చేపట్టిన రెండు ప్రాజెక్టులు, 2.87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రెండు పార్కుల నిర్మాణం పూర్తయ్యాయి.