పాక్‌లో బెలూచిస్తాన్‌కు మోడీతో విముక్తి?

Chakravarthi Kalyan
బెలూచిస్తాన్ ను ఆక్రమించుకుని తమ వనరుల్ని దోచుకుని చైనాకు అప్పజెబుతోందని ఆ దేశ మాజీ ప్రధాని బహిష్కరణకు గురైన ఖాద్రీ అన్నారు. పాకిస్థాన్ బెలూచిస్తాన్ ను ఆక్రమించుకున్న తర్వాత ఆయన్ని దేశం నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ఆయన ఇండియాలోని హరిద్వార్ లో పర్యటిస్తూ ఇండియా ప్రధాని మోదీ తలుచుకుంటే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా చేయొచ్చు. బెలూచిస్తాన్ కు స్వతంత్రం వచ్చేలా మోదీ చేసి తమకు తమ దేశాన్ని అప్పగించాలని కోరుతున్నారు.


పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి ఇండియా, పాక్ యుద్ధం కారణం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. యుద్దనాంతర పరిస్థితుల తర్వాత అంత సద్దు మణిగిందని అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు ఇప్పటికీ వలసలు ఆగడం లేదు. ఎప్పటిలాగే తయారైంది పరిస్థితి.


కానీ భారత్ కు ఆ యుద్ధంతో వచ్చిన ప్రయోజనం ఏదైనా ఉందంటే పాక్ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ కు రావాలంటే ఇండియా నుంచే రావాలి. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత రహదారి రాకపోకలు బంద్ అయ్యాయి. తద్వారా ఇండియా కూడా చాలా సేఫ్‌ గా అయింది. అయితే ఇందిరాగాంధీ తన ఉనికినే చాటుకోవడానికి ఈ యుద్ధం చేసిందని చాలా మంది రాజకీయ మేధావులు చెబుతుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆమెకు వ్యతిరేకం వర్గం పెరిగిపోవడం దాని నుంచి ఆమె తప్పించుకోవాలో తెలియక బంగ్లాదేశ్ యుద్ధం పరిస్ధితులు తలెత్తాయి. కానీ బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత ఇండియాకు వచ్చిన లాభం లేదు.


నెహ్రు వారసురాలిగా ప్రధానిగా తాను ఉండటానికి అన్ని విధాల అర్హురాలినని ఆమె చెబుతుండే వారు. ప్రధాని పదవిని ఏ మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడే వారు కాదు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఎదుర్కొవడానికి ఆమె ఆ మార్గాన్ని ఎంచుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: