హైదరాబాద్‌ మెట్రో ఎండీపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు?

Chakravarthi Kalyan
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పుణ్యమా అని ఎన్‌విఎస్‌ రెడ్డి మెట్రో రైలు ఎండీ అయ్యారని.. ఇప్పుడు అదే ఎన్ వీఎస్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తగా మారారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినేనన్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌.. 70శాతం పనులు కూడా ఆయన హాయాంలోనే పూర్తయ్యాయన్నారు. మూడు ఫేజులలో మెట్రో నిర్మిస్తామని చెప్తున్నారే కానీ...నిధులు ఎక్కడ నుంచి సమీకరిస్తారో చెప్పలేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.


కేసీఆర్‌కు వత్తాసు పలికే అధికారులు రిటైర్మెంట్ అయినా....వాళ్ల సర్వీసులు ఎక్స్ టెన్షన్ చేస్తున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. వర్షాలతో రాష్ట్రం అంతా...ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే  హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు రాజకీయాలు చేయడం ఏమిటని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కరపత్రాన్ని ఏన్ వీ ఎస్ రెడ్డి చదివారని మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్న కేసీఆర్‌ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మహేష్‌కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: