పైనుంచి ఊడి పడ్డావా.. చిరుకు విజయసాయి షాక్?
ఉన్నమాటంటే ఉలుకెందుకని చిరంజీవిని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదని... ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని.. మా గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని... వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.