రుషికొండ సరే.. విశాఖలో పవన్‌కు ఇవేవీ కనిపించవా?

Chakravarthi Kalyan
రుషికొండ పర్యటన పేరుతో ఇటీవల పవన్‌ కల్యాణ్‌ కాస్త హడావుడి చేశారు. అయితే రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అంతే కాదు.. నిర్మాణాలు ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి డెవలప్‌మెంట్‌ ఎప్పటికప్పుడు అఫిడవిట్‌ రూపంలో అందిస్తోంది. కోర్టు మార్పులు చెబితే అవి ప్రభుత్వం అమలు చేస్తుంది.


అయితే.. ఇదే పవన్‌ కల్యాణ్‌కు విశాఖలోని మరికొన్ని అక్రమాలు కనిపించవా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే రుషికొండపై రామానాయుడు స్టూడియో పవన్‌కు కనబడలేదా అని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. అలాగే లోకేష్‌ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ కబ్జా కూడా పవన్‌కు కనబడలేదా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. స్వయంగా  చిరంజీవి, పవన్‌ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండపైనే ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: