గుడ్‌న్యూస్: ఇండియా చైనా చర్చల్లో కీలక మలుపు?
పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఎసితో పాటు మిగిలిన సమస్యల పరిష్కారంపై ఇరు దేశాలు సానుకూల, నిర్మాణాత్మక, లోతైన చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో పరిస్థితులపై ఇప్పటికే తయారు చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా పరిస్థితులపై రెండు దేశాలు అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి, సైనిక,దౌత్య మార్గాల ద్వారా చర్చల వేగాన్ని కొనసాగించడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.