కోర్టుకు లోకేశ్.. పాదయాత్రకు విరామం?

Chakravarthi Kalyan
మంగళగిరి కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందువల్ల ఇవాళ నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. న‌టుడు, ద‌ర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ పోసాని కృష్ణముర‌ళి తనపై చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై చర్యలు కోరుతూ నారా లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్నారు. అలాగే సింగ‌లూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తిపైనా నారా లోకేష్‌ ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు.


ఎటువంటి ఆధారాలు లేకుండా త‌నకి అవినీతి బుర‌ద అంటించాల‌ని చూశారంటూ  సింగ‌లూరు శాంతి ప్రసాద్‌పై నారా లోకేష్‌ కోర్టులో కేసు దాఖ‌లు చేసారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం న‌మోదు కోసం మంగ‌ళ‌గిరి మేజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ నారా లోకేష్‌ హాజ‌రు కానున్నారు. ఓ యూట్యూబ్ చాన‌ల్‌కి పోసాని కృష్ణముర‌ళి గతంలో ఇంట‌ర్వ్యూ ఇస్తూ కంతేరులో నారా లోకేష్ 14 ఎక‌రాలు భూములు కొనుగోలు చేశార‌ని ఆరోపణలు చేశారు. కంతేరులో అర‌సెంటు భూమి కూడా లేని త‌న‌పై ఈ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన పోసాని క్షమాప‌ణ చెప్పాల‌ని త‌న న్యాయవాది ద్వారా నారా లోకేష్‌ నోటీసులు పంపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: