అల్యూమినియం వంటసామాన్లను విక్రయించడమే ప్రధాన వృత్తిగా జీవనంకొనసాగిస్తున్న తమకు ఒక స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని తెలంగాణ వీర భద్రియ (వీర ముష్టి) సంఘం ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన... తెలంగాణ వీర భద్రియ (వీర ముష్టి) సంఘం కేంద్ర కమిటీ స్వర్ణోత్స వేడుకల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వీరభద్రియులు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని, అప్పుడే కుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈటల సూచించారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడే వీరభద్రియ లను ఎంబీసీలో చేర్చడం జరిగిందన్నారు. బీసీలు అగ్రకులల చేతిలో అణిచివేతకు గురికాకుండా ఉండాలంటే.. రానున్న ఎన్నికల్లో బీసీలు అందరూ ఏకం కావాలని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కోరారు. అర్హులైన వీరభద్రులందరికీ బి సి, ఎంబిసి బంధు పథకాన్ని అమలు చేయాలని ఈటల కోరారు. గురుకుల విద్యాలయాల్లో వీరి పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పించాలన్నారు.