తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఖాళీ నేడో, రేపో భర్తీ కాబోతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ప్రస్తుతం శాసనమండలికి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికినప్పటి నుంచి కేబినెట్ లో ఆ స్థానం ఖాళీగానే ఉంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తాండూరు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా జాబితాలో ప్రకటించారు. అందుకే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ లేదా రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే సమయాన్ని బట్టి విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది.