టీడీపీలో ఉంటే పత్తిత్తులు.. వైసీపీలోకి వస్తే అపవిత్రులా?
2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని ఏమైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీరా.. ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు కడిగే వాడా అంటూ పేర్ని నాని నిలదీశారు. ఆ లారీ క్లీనర్‌ని చూస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ప్యాంట్లు తడుస్తున్నాయని... ఆ లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు టీడీపీకి అవసరం లేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. కొడాలి నానిని తాము చంద్రయాన్ సైంటిస్టు అని చెప్పుకోలేదే అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.