డిజిటల్ రంగంలో రైతుబడి యూట్యూబ్ ఛానల్ సంచలనం?
ఈ ఛానల్ వన్ మిలియన్ స్టోన్ వేడుక హైదరాబాద్ రవీంద్ర భారతిలో వేడుకగా సాగింది. ఈ తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సమాచార శాఖ మాజీ కమీషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.