బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?

Chakravarthi Kalyan
ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నెలకు ఇప్పటి వరకు ఇస్తున్న మొత్తం 6000 రూపాయలను పదివేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.  ఆలయానికి ఇచ్చే మొత్తాన్ని 4000 రూపాయలకు, అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 6000 రూపాయలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇటీవల గోపన్ పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవం వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ బ్రాహ్మణులకు ఈ హామీ ఇచ్చారు.


ఆ హామీకి అనుగుణంగా దేవాదాయ శాఖ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేధ్య పథకం కింద అర్చకుల గౌరవవేతనాన్ని పెంచినందుకు సీఎం కేసీఆర్ కు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గ‌తంలో 1805 ఆల‌యాల‌కు మాత్రమే ధూపదీప నైవేద్య పథకం అమలయ్యేదని.. దాన్ని దశల వారీగా పెంచుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాల‌యాల‌కు ధూపదీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌ తెలిపారు. ధూపదీప నైవేద్య పథకానికి ఏటా రూ. 78.49 కోట్లు వ్యయం అవుతున్నట్లు మంత్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: