కాంగ్రెస్‌తో పొత్తు.. పునరాలోచనలో షర్మిల?

Chakravarthi Kalyan
షర్మిల ఇటీవల సోనియా, రాహుల్‌ గాంధీలను కలిసిన సంగతి తెలిసిందే. పార్టీని విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించారు కూడా. అయితే.. అనూహ్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి జగన్‌కూ మధ్య అవగాహన కుదిరిందట. ఈ విషయం తెలియక షర్మిల ఒంటరిగా మిగిలిపోయారట. ఇప్పుడు ఈ విషయం తెలిశాక.. తాను కాంగ్రెస్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఏమిటన్న మీమాంసలో ఆమె పడిపోయారట.

తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని షర్మిలపై కాంగ్రెస్ ఆంక్షలు పెట్టింది. అటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా పాల్గొనవద్దని కాంగ్రెస్‌ షరతు విధించిందట. దీంతో షర్మిల జీర్ణించుకోలేక పోతున్నారట. జగన్‌ రెడ్డి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరిలో వచ్చిన మార్పు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా ఆ పార్టీకి నష్టం చేస్తుందంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక షర్మిల ఆలోచనలో పడ్డారట. ఇలాగైతే కాంగ్రెస్‌లో చేరడం కంటే సొంత పార్టీ యే బెటరని ఆమె ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: