కాంగ్రెస్ సభపై బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందా?

Chakravarthi Kalyan
పరేడ్ మైదానంలో ఈ నెల 17న సాయంత్రం 10లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ కోసం ఈ నెల 2వ తేదీనే డిఫెన్స్‌ శాఖకు లేఖ ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అయితే.. సభకు గ్రౌండ్‌ ఇవ్వకుండా భారాస, భాజపా కుట్రపన్నుతున్నాయనిటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వమే కుట్రదారుగా మారడం దారుణమన్న రేవంత్ రెడ్డి.. రెండవ అప్షన్‌గా ఎల్బీస్టేడియం ను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసామన్నారు.


ఒకవేళ బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా కార్యక్రమం వాయిదా వేసేది లేదని.. ఔటర్‌ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలని రేవంత్ రెడ్డి నేతలకు సూచించారు. ఆ సభ ద్వారా సోనియా గాంధీ ఇచ్చే 5గ్యారంటీలను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఈ సభలో పాల్గొని 5గ్యారంటీలను ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: