రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు?
ఉదయం నుంచి వాదనలు సాగాయి. మధ్యలో గంటపాటు భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో వాదనలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు ముగిశాయి. గంటల తరబడి ఈ వాదనలు జరిగాయి. అయితే.. ఎట్టకేలకు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గంటకు కోటిన్నర రూపాయలు వెచ్చించి లాయర్ ను పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.