స్కిల్‌ స్కామ్‌: డిజైన్‌ టెక్‌ కంపెనీ షాకింగ్‌ ప్రకటన?

Chakravarthi Kalyan
ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ఓ వీడియో విడుదల చేశారు. స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్న డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్.. మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని.. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ వీడియోలో వివరించారు.


ఈ ఒప్పందంలో పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ తెలిపారు. ఇందులో జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదని.. ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్‍కు సంబంధించి తమతో సంప్రదించలేదని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ అన్నారు. ఆడిటర్లను పంపితే పూర్తి లక్కలు చూపుతామని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: