అదిరిపోయే మేనిఫెస్టో రెడీ చేస్తున్న టీ కాంగ్రెస్?
మేనిఫెస్టో ఏవిధంగా ఉండాలన్నఅంశంపై ఇటీవల పార్టీ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా ఆచరణకు సాధ్యమయ్యేవే మేనిఫెస్టోలో ఉండాలని తాము భావిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్ శ్రీధర్ తెలిపారు. మేనిఫెస్టోపై అన్నివర్గాల ప్రజలు తమ ఆలోచనలను, సలహాలను తమకు తెలియచేయాలని కమిటీ ఛైర్మన్ శ్రీధర్ సూచించారు. తాము ప్రకటిస్తున్న డిక్లరేషన్లు, ఐదు గ్యారంటీ హామీలు కూడా మేనిఫెస్టోలో భాగమేనని కమిటీ ఛైర్మన్ శ్రీధర్ స్పష్టం చేశారు.