కవిత ఇలాఖాలో దొంగ ఓట్ల కలకలం?

Chakravarthi Kalyan
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలు అన్నీ ఇప్పటికే ఓట్ల వేట ప్రారంభించాయి. ఇదే సమయంలో దొంగ ఓట్ల గురించి కూడా పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇలాకాలో బోధన్‌లో పెద్ధ ఎత్తున దొంగ ఓట్ల నమోదు జరుగుతోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అంటున్నారు. ఆయన ఈమేరకు సీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. దొంగ ఓట్ల నమోదులో ఎమ్మెల్యే షకీల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఎంపీ ఆర్వింద్‌ ఆరోపించారు.


బోధన్‌లోని నాలుగు బూత్‌లలో వేల సంఖ్యలో బోగస్‌ ఓట్లు నమోదు చేసుకున్నారని ఎంపీ ఆర్వింద్‌ మండిపడ్డారు. బోధన్‌, నిజామాబాద్ మీ సేవ సెంటర్ల నుంచి నమోదు జరిగిందని ఎంపీ ఆర్వింద్‌ అన్నారు. బోగస్‌ ఓట్లతో పాటు మీ సేవ సెంటర్లపై దర్యాప్తు జరపాలని ఎంపీ ఆర్వింద్‌ కోరారు. బీజేపీ ప్రతినిధి బృందం ఈ మేరకు ఇటీవల రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: