మహిళా రిజర్వేషన్లు.. కోటాలో కోటా అవసరం?
బీఎస్‌పీ అధినేత మాయావతి కోరుతున్నట్లు జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 రిజర్వేషన్ కల్పించాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదం పొందిన నేపథ్యంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఓబీసీ మహిళల శాతం ఎంత అన్నది చెప్పాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. లేకపోతే మళ్లీ ఆధిపత్య వర్గాల మహిళలే చట్టసభల్లోకి వస్తే పేదలకు ఆ అవకాశాలు రాకుండా పోతాయని... ఈ విషయంపై బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు బీఎస్‌పీ పోరాటం చేస్తుందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.