జైలులో అలా చంద్రబాబును చూసి లోకేష్ షాక్?
న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది తప్ప.. జరగకుండా పోదని నారా లోకేష్ అన్నారు. దీనిపైన ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చ తప్పకుండ జరగాల్సిందేనన్న నారా లోకేష్.. చేయని తప్పుకు జైలుకు పంపితే భవిష్యత్ లో ఇంకెవరైనా రాజకీయల్లోకి వస్తారా అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు సేవ చేయడానికి నీతిమంతులు రాజకీయల్లోకి రారని నారా లోకేష్ అన్నారు. మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు.