టీడీపీ అధికారంలోకి రాగానే చేసే మొదటి పని ఇదే?
చంద్రబాబు కు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రజలంతా కదిలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. నిరసనల్లో టీడీపీ వాళ్ళ కన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారని.. అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలుపుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఒక్క ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును జైల్లో పెట్టడమే నా మనస్సును బాధిస్తోందన్న నారా లోకేష్.. ప్రజాగ్రహం చూసి సైకో జగన్ కి వణుకు పుడుతోందన్నారు.