తెలంగాణలో జాతీయ సర్వే చెప్పిన సంచలన విషయాలు?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పిన లోక్ పోల్ సంస్థ.. ఆగష్టు 10 నుండి సెప్టెంబరు 30 వరకు  తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్టు తెలిపింది. ఎన్నికల హామీలు అమలుచేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కొంప ముంచుతాయని లోక్ పోల్ సంస్థ తెలిపింది.

సీఎం కేసీఆర్ పైనా పెరుగుతున్న వ్యతిరేకత కొంప ముంచుతుందని లోక్ పోల్ సంస్థ చెప్పింది. అలాగే ఓటు బ్యాంకును భారీగా కోల్పోయిన బీజేపీకి కూడా దెబ్బ పడుతుందట. ఇక ఓల్డ్ సిటీలో పట్టు నిలుపుకున్న ఎంఐఎం తన సీట్లు కాపాడుకుంటుందట. ఇక  కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు  ప్రజలపై ప్రభావం చూపుతున్నాయట. రైతులు, నిరుద్యోగుల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత.. బీసీలు, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీ కి పెరుగుతున్న మద్దతు.. లోక్ పోల్  కనిపించాయట. నిజామాబాద్, మెదక్ లోకసభ పరిధిలో పట్టు నిలుపుకోనున్న బీఆర్ఎస్ పార్టీ.. అధికారం మాత్రం కోల్పోక తప్పదట. ఇక ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్, నల్గొండ, జహీరాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు దక్కించుకోనున్న కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: