ఆ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్‌ ఆపేస్తారా?

Chakravarthi Kalyan
ఎరుకల జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఉందని.. అందుకే ఎమ్మెల్సీగా తీసుకున్నామని.. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎరుకల జాతికి అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎరుకల జాతికి ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి అవకాశం కల్పించామని.. ఇలాంటివారిని గవర్నర్ తిరస్కరించారని.. దేశంలోనే బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి మొత్తం టిఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నర్ కి అనుమానంగా ఉందన్న మంత్రి హరీశ్‌రావు.. విశ్వ బ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్ట కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా.. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: