తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చి బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు పని చేసింది ఒక లెక్క ఇప్పటి నుండి పని చేసేది ఒక లెక్క.. అంటున్నారాయన. 60 రోజుల టార్గెట్ పెట్టుకొని పని చేయాలంటున్న .. బీఎల్ సంతోష్ ఎన్నికల కోసం 43 సభలు ప్లాన్ చేసినట్టు తెలిపారు. మునుగోడులో ఒడిపోయాము అని మీరు అంటున్నారు.. కానీ మనం బలపడినం.. 12 వేల ఓట్ల నుండి 90 వేల ఓట్లు వచ్చాయి.. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్ల నుండి 48 స్లిటు గెలిచామని బీఎల్ సంతోష్ తెలిపారు.
ఎప్పటి నుండి పని చేస్తున్నాం టికెట్ ఇవ్వాలి అంటే కుదరదన్న బీఎల్ సంతోష్.. 119 స్థానాలకోసం 2000 మంది టికెట్ అడుగుతున్నారన్నారు. స్థానికంగా బలం ఆధారంగానే టికెట్ ఇస్తామని.. ముఖ్యమంత్రి ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు.
ఎవరు కూడా నేను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దని సూచించిన బీఎల్ సంతోష్.. అధికారంలోకి వస్తే అందరికి పదవులు వస్తాయన్నారు.