కాంగ్రెస్‌కు 75.. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిపి 36?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని.. అసెంబ్లీ ఎన్నికల్లో రోజు రోజుకు మారుతున్న పరిణామాలు చూస్తే.. బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురికి కలిపి 36 సీట్లు మాత్రమే వస్తాయని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంచనా వేశారు. మిగతా సీట్లు అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లో బిల్లా, రంగాలు చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారని.. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. మమ్మల్ని మరుగుజ్జు లు అంటున్నరా... కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల , గజ్వేల్ లో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చెయ్యరని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని.. ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చామని... అవి నెరవేరుస్తామని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: