తెలంగాణ కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్టుపై ఉత్కంఠ?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ మొదటి జాబితా ఈ నెల 15వ తేదీన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ మేరకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ వివాదరహిత నియోజక వర్గాల జాబితా సిద్దం చేసింది. ఈ జాబితా 60 నుంచి 65 నియోజక వర్గాలు ఉండొచ్చు. వందకు పైగా నియోజక వర్గాలల్లో స్క్రీనింగ్‌ కమిటీలో కసరత్తు పూర్తయింది. కొన్ని మార్పులు చేర్పులు ఉండడంతో ఆలాంటి నియోజక వర్గాలను మొదటి జాబితాలో కాకుండా తరువాత ప్రకటించే అవకాశం ఉంది.


ఫస్ట్ లిస్టులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బలమైన నాయకులు ఉన్న నియోజక వర్గాలు ఉండొచ్చు. వామపక్షాల పొత్తులు కొలిక్కి రాలేదు. ఇంకా పార్టీలో చేరికలు ఉన్నాయి. బలమైన నాయకులు బయట నుంచి వస్తే వారికి టికెట్‌ ఇవ్వొచ్చు. రెండో జాబితాలో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: