బాబు ఆరోగ్యం: జైలు అధికారులతో లోకేష్‌ గొడవ?

Chakravarthi Kalyan
చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్‌ను నారా లోకేష్ గొడవపెట్టుకున్నట్టు తెలిసింది. ములాఖత్ కోసం జైలుకు వెళ్లిన నారా లోకేష్‌ అనంతరం బాబు ఆరోగ్యం పై అక్కడే డీఐజీని గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదిక ను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డిఐజిని నారా లోకేష్‌ నిలదీసినట్టు తెలిసింది. చంద్రబాబు కు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని నారా లోకేష్‌ ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ నారా లోకేష్‌ మండిపడ్డట్టు తెలిసింది. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని నారా లోకేష్‌ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: